Saturday, January 18, 2025
HomeUncategorized'గామి'పై ఆసక్తిని పెంచిన విష్వక్సేన్!

‘గామి’పై ఆసక్తిని పెంచిన విష్వక్సేన్!

మొదటి నుంచి కూడా విష్వక్సేన్ మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, అందుకు సంబంధించిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఈ కారణంగా ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ సారి ఆయన తన ఇమేజ్ కి భిన్నమైన కంటెంట్ ను ఎంచుకున్నాడు. కొత్తగా ప్రేక్షకులకు కనిపించడానికి గట్టిగా ఒక ప్రయత్నం చేశాడు .. ఆ ప్రయత్నం పేరే ‘గామి’. ఇప్పుడు విష్వక్ నుంచి రానున్న సినిమా ఇదే. ఈ సినిమాతో విద్యాధర్ అనే కొత్త దర్శకుడికి ఆయన ఛాన్స్ ఇచ్చాడు.

ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే అందరిలో ఆసక్తి మొదలైంది. విష్వక్ లుక్ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండటం .. అఘోరాల నేపథ్యం ఈ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి విష్వక్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోనే వస్తున్నాడనే విషయం ఈ ట్రైలర్ చూసిన తరువాత అర్థమవుతోంది.

హిమాలయాలలో 36 ఏళ్లకి ఒకసారి ఒక మహా అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం జరిగే సమయానికి హీరో అక్కడికి చేరుకోవాలి. ఆ అద్భుతానికీ .. హీరో అనుకున్నది సాధించడానికి మధ్య సంబంధం ఉంటుంది. ఆ అద్భుతం జరిగే సమయానికి అక్కడికి వెళ్లలేకపోతే, మరో 36 ఏళ్లు ఎదురుచూడవలసి ఉంటుంది. ఇదే ఈ కథలోని ప్రధానమైన అంశం. ఆ సమయానికి అక్కడికి చేరుకోవడానికి హీరో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడనేది ఉత్కంఠను పెంచనుంది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్