Sunday, January 19, 2025
HomeTrending Newsయాదగిరిగుట్ట ఆలయం అద్భుతం - గద్దర్

యాదగిరిగుట్ట ఆలయం అద్భుతం – గద్దర్

కుల, మతాలకు అతీతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈ రోజు గద్దర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేకంటే ముందు యాదగిరిగుట్టకు వచ్చి తెలంగాణ వస్తే నర్సన్నకు ప్రత్యేక పూజలు చేస్తామని మొక్కుకున్నామని.. అదేవిధంగా ప్రజలు పూజిస్తున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట నర్సన్న ఆలయాన్ని అద్భుతంగా నిర్మించినందుకు సీఎం కేసీఆర్ కు గద్దర్ ధన్యవాదాలు చెప్పారు.

శిల్పకళా సముదాయంతో నిర్మించిన ఆలయాన్ని చూస్తుంటే మరో ప్రపంచంలో విహరించిన అనుభూతి కలుగుతోందని గద్దర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పవిత్రమైన ఆలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సూచించారు. భగవంతుడు, ప్రకృతి అంటే ఒక ప్రశాంతతను కలిగించేవి.. అలాంటి ప్రశాంతత ఇక్కడ దొరుకుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్