Tuesday, March 17, 2026
HomeసినిమాRam Charan: 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ ఫిక్స్?

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

రామ్ చరణ్‌, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ  హీరోయిన్ గా నటిస్తోన్న ఈ  చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తుంటే… ఎస్.జె.సూర్య విలన్ పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంది. అయితే.. ఇండియన్ 2 కూడా షూటింగ్ చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ కాస్త స్లో అయ్యింది.

తాజా వార్త ఏంటంటే.. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయ్యిందని డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అయితే.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ ప్రకటించలేదు. సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే.. సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ కే రిలీజ్ ఉంది. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ ఉంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందుచేత ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి ఉండదని.. సమ్మర్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని సమ్మర్ లో కాకుండా.. డిసెంబర్ 22న విడుదల చేయాలి అనుకుంటున్నారట. త్వరలో మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలిసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్‌ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ చరణ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular