Sunday, March 15, 2026
Homeసినిమా‘గేమ్ ఆన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

‘గేమ్ ఆన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Game On:
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్,  గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “గేమ్ ఆన్” సినిమా రవి కస్తూరి సమర్పణలో డిసెంబర్ మూడవ వారంలో షూటింగ్ మొదలవుతుంది. సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన కుమార్ బాబు నిర్మాతగా తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన తొలి చిత్రం ‘రథం’తోనే మంచి పేరు తెచ్చుకొని అందరి ప్రశంశలు పొందిన గీతానంద్ హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు దయానంద్  రూపొందించిన ‘బాయ్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది.

సినిమా స్టార్ట్ చేయకుండానే సినిమా కథ తెలిసి హిందీ రైట్స్ అడగడం ఆశ్చర్యకరంగా ఉంది. నాకు తెలిసి ఈ సినిమా చిన్న సినిమాల్లో చాలా పెద్ద సినిమా అవుతుంది. అలాగే.. ఇందులో ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎమోషన్, లవ్ సెంటిమెంట్స్, ట్విస్టులు ఇలా అన్ని రకాలుగా అందరిని ఆకట్టుకునే అంశాలు అన్నీ ఉన్నాయి. నాకున్న అనుభవంతో చెప్తున్నా టాప్ టెన్ మూవీస్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది. ఈ సినిమాతో గీతానంద్ మంచి హీరోగా నిలబడటమే కాకుండా దర్శకుడిగా దయానంద్ మంచి మార్కులు కొట్టేస్తాడు. మంచి  టెక్నీషియన్స్ దొరకడమే కాకుండా ఈ సినిమాకు ఆర్టిస్టులు అందరూ సెట్ అవుతున్నారు. చాలా మంచి ఇంపార్టెంట్ మధుబాల మదర్ క్యారెక్టర్ చేస్తుంది. కన్నడ కిషోర్, మధుసూదన్  చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతున్నారు. ఈ సినిమా 2022లో ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత కుమార్ బాబు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular