Video Song: సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్ పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా గంధర్వ చిత్ర పోస్టర్‌ను బాబూమోహన్ ఆవిష్కరించగా, జులై1న విడుదలచేస్తున్నట్లు హీరో సందీప్ మాధవ్ ప్రకటించారు. లిరికల్ సాంగ్ వీడియోను హీరో సాయికుమార్ విడుదల చేశారు.
సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్య దేశభక్తి చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. వాటిలో ఎమోషన్స్ బాగా పండుతుంది. మొన్న విడుదలైన మేజర్, విక్రమ్ అందుకు ఉదాహరణలు. ఇక దర్శకుడు వీరశంకర్ గారు గంధర్వ కథను నా దగ్గరకు తీసుకువచ్చారు. సందీప్‌తో చేయడం గొప్పగా ఫీలవుతున్నాను. గంధర్వ టైటిల్‌లో చూపించినట్లుగా 1971-2021 కథ. అయితే నా సినీ కెరీర్ కూడా 1972 నుంచి ఇంకా కొనసాగుతుంది. నా ఫిలిం కెరీర్ యాభై ఏళ్ళ జర్నీలో గంధర్వ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇందులో ప్రధానమైన పాత్ర పోషించాను. కథే చాలా కొత్త పాయింట్. సందీప్ ఇందులో ఫైట్స్ బాగా చేశాడు. దర్శకుడు మిలట్రీ మనిషి కాబట్టి నాతో కూడా యాక్షన్ చేయించాడు. అన్ని సినిమాలు బాగుండాలి. అందులో మా సినిమా వుండాలి. జూలై1న రాబోతుంది. డోన్ట్ మిస్” అన్నారు.
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ ” ఇంతకు ముందు కమర్షియల్ సినిమాలు చేశాను. గంధర్వ ఫిక్షన్ పాయింట్. ఎందుకు, ఏమిటి? ఎలా జరుగుతుంది? అనే ఆసక్తికరమై కథతో నిర్మాత సబాని గారు కొత్త దర్శకుడు అప్సర్‌తో బడ్జెట్‌కు వెనుకాడకుండా నిర్మించారు. సాయికుమార్, బాబూమోహన్ సినిమాలు చూసి చాలా నేర్చుకున్నాను. వీరశంకర్ గారు బాగా గైడెన్స్ ఇచ్చేవారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతాన్ని బాగా సమకూర్చాడు. సురేష్‌కొండేటి గారు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతో మా సినిమా స్థాయి పెరిగింది. దర్శకుడు అప్సర్ రాసుకున్న డైలాగ్స్, ఎమోషన్స్ బాగా పండాయి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
చిత్ర దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ… గంధర్వ స్టోరీ లంచ్ టైంలో సందీప్‌కు వినిపించాను. వెంటనే చేద్దామన్నారు. అప్పటి నుంచి జూలై 1 విడుదల వరకు జర్నీ సాగింది. అన్నీ అనుకున్నట్లు జరిగాయి. మొదటి ప్రివ్యూతోనే బిజినెస్ అయింది. ఇందుకు షకీల్, సందీప్ కారణం. మా గురువు గారు వీరశంకర్ మంచి సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ అనుకూలించాయి. ప్రభాస్ తొలి చిత్రానికి పనిచేసిన జవహర్‌రెడ్డి మా సినిమాకు పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అందరూ సహకరించారు. ర్యాప్ రాక్ షకీల్ చిన్న సినిమాలకు ఎ.ఆర్. రెహమాన్ లాంటి వాడు. సాయికుమార్ కథ చెప్పగానే వెరైటీగా వుందని చేద్దామన్నారు. దాంతో కొంచెం ధైర్యం వచ్చింది. ఆ తర్వాత బాబూమోహన్ గారు కథ చెప్పగానే ఈ పాయింట్ ఇప్పటి వరకు రాలేదన్నారు. మొదటి సినిమాతోనే బాగా చేశావనే ఆశీస్సులు పొందాను. అలాగే నటీనటులంతా బాగా సహకరించారు. మా కుటుంబసభ్యులు అండగా నిలిచారు. ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను నేను తీశాను. ప్రతివారూ చూడాల్సిన సినిమా అని చెప్పారు.