Sunday, March 8, 2026
HomeTrending News12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్

12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్

జూన్ 12వ తేదీన గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్ళ గ్రామంలో మంగళవారం శ్రీ స్వయం భూరాజేశ్వర ట్రస్టు వాసవి నిత్యాన్నదాన సత్రంను హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితెల సతీశ్ తో కలసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ కామెంట్స్ :

గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్య శ్యామలం అవుతుందని, హుస్నాబాద్ లో 10 కోట్లతో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తాం. ప్రతీ ఏఎన్ఏం సబ్ సెంటరుకు 20 లక్షలు నిధులు కేటాయింపు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్నీ తండాలకు త్వరలోనే రోడ్లు మంజూరు చేయిస్తా.

బీజేపీ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా మిల్లర్లపై రైడింగ్ పేరిట వేధింపులకు గురి చేస్తే., తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లు కొనుగోళ్లు పూర్తి చేస్తున్నది. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్ ఘర్ లలో బీజేపీ, కాంగ్రెస్ పాలన ఉన్నా కానీ కనీసం వడ్లు కొనే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రాల నుంచి వడ్లు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కంటే మన తెలంగాణ రాష్ట్రంలో 500 ఎక్కువ వస్తున్నాయని వడ్లు విక్రయాలు చేసుకునేందుకు తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బండి సంజయ్ ఒకవైపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరోవైపు పాదయాత్రలు చేయడం విడ్డూరం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏఎన్ఎం సబ్ సెంటర్లను పల్లె ఆసుపత్రులుగా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం.

Also Read : కేంద్ర తీరుతో ప్రజలు ఇబ్బందులు : హరీష్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular