Sunday, January 19, 2025
Homeసినిమాట్రెండింగ్ లో నిలిచిన గౌతమ్ కృష్ణ

ట్రెండింగ్ లో నిలిచిన గౌతమ్ కృష్ణ

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఘట్టమనేని ‘1-నేనొక్కడినే’ సినిమాతో బాల నటుడిగా తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించలేదు కానీ.. మహేష్‌ అండ్ సుకుమార్ కి మంచి పేరు తీసుకువచ్చింది. అయితే.. ఈ మూవీ ప్రత్యేకత గౌతమ్ కృష్ణ. తొలి సినిమా అయినప్పటికీ.. ఎక్కడా తడబాటు లేకుండా చాలా చక్కగా నటించాడు. గౌతమ్ మెప్పించడంతో ఫ్యూచర్ స్టార్ అంటూ ఆశీస్సులు అందించారు సినీ జనాలు.

గౌతమ్ ఇప్పుడు నూనూగు మీసాల టీనేజర్ దశలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే..  ప్రేమలు చిగురించే హైస్కూల్ దశలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. గౌతమ్ కి స్వతహాగా చాలా సిగ్గు. అయినప్పటికీ… స్టేజ్ పర్ ఫార్మాన్స్ లో అద్బుతంగా నటించి అందరికీ సర్ ఫ్రజ్ ఇచ్చాడు. అతడిలోని మ్యాన్ లీ నెస్ కి ఇది సింబాలిక్ గా కనిపిస్తోంది. ఘట్టమనేని వంశంలో భవిష్యత్ సూపర్ స్టార్ తొలి స్టేజీ పెర్ఫామెన్స్ చూడగానే అభిమానుల ఆనందానికి అవధులే లేవు.

గౌతమ్ మదర్ నమ్రత శిరోద్కర్ అయితే ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇంత కంటే ఎక్కువ చూడడానికి వేచి ఉండలేను అనే క్యాప్షన్ తో గౌతమ్ స్టేజ్ పెర్ఫామెన్స్ వీడియోని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసారు. గౌతమ్ ఘట్టమనేని మొదటి థియేటర్ ప్రొడక్షన్ వీడియోను నమ్రత పంచుకోగా దానిని అభిమానులు జెట్ స్పీడ్ తో వైరల్ చేసారు. ఈ స్టేజీ డ్రామా డిస్నీ ఫ్రోజెన్ ఆధారంగా రూపొందింది. ఇందులో గౌతమ్ క్రిస్టాఫ్ అనే పాత్రను పోషించాడు. మరి.. కొడుకు స్టేజ్ పర్ ఫార్మెన్స్ పై తండ్రి మహేష్‌ కూడా స్పందిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్