Monday, February 24, 2025
Homeసినిమాసీఎం రిలీఫ్ ఫండ్ కు గీతా ఆర్ట్స్ విరాళం

సీఎం రిలీఫ్ ఫండ్ కు గీతా ఆర్ట్స్ విరాళం

Allu-Donation:
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను ఊహించని వరదలు ముంచెత్తాయి. గత కొన్ని దశాబ్దాలలో చూడనటువంటి విపత్తు ఎదురైంది. ముఖ్యంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. తిరుపతిని జల విలయం చుట్టేసింది. ఈ వరదల కారణంగా ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లింది. తక్షణమే ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా మేమున్నామని అండగా నిలబడటానికి అల్లు ఫ్యామిలీ ముందుంటుంది.

తిరుపతి వరదలకు స్పందించిన నిర్మాత అల్లు అరవింద్ తన వంతు సహాయం అందించారు. ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలను ముంచెత్తిన వరదలు కారణంగా నష్టపోయినవారి సహాయార్ధం తనవంతు సాయంగా గీతా ఆర్ట్స్ తరఫున 10 లక్షల రూపాయలు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వరదలు బాధాకరమని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని అరవింద్ ఆకాంక్షించారు.

Also Read : ‘అఖండ’ ప్రీ రిలీజ్ కు అల్లు అర్జున్

RELATED ARTICLES

Most Popular

న్యూస్