Sunday, January 19, 2025
Homeసినిమాగ‌ని ట్రైల‌ర్ కు ముహుర్తం ఖ‌రారు

గ‌ని ట్రైల‌ర్ కు ముహుర్తం ఖ‌రారు

Ghani Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం గని. ఈ చిత్రంతో కిరణ్ కొర్రపాటి దర్శకుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, సాయి మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌  క్రియేట్ చేశారు.  ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్‌గా క‌నిపించ‌నున్నారు. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌ల పై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో గని చిత్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందింది. దీనికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్  తమన్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీ టీజర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ మూవీ థ్రియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను మార్చి 17న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేయ‌నున్నారు. తాజా అప్ డేట్ తో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు గని ట్రైలర్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక భారీ స్పోర్ట్స్ డ్రామా గ‌ని చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయ‌నున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్