ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. హరితహారం తెలంగాణకు మణిహారం అన్నారు. హైదరాబాద్ లో 919 బహిరంగ ప్రదేశాలను పార్కులుగా అభివృద్ధి చేశామని తెలిపారు. నగరాన్ని పచ్చగా మార్చడానికి జిహెచ్‌ఎంసి బడ్జెట్‌లో గ్రీన్ బడ్జెట్ కింద 10 శాతం నిధులు కేటాయించామని మేయర్ వెల్లడించారు. మునుపెన్నడూ లేని విధంగా మియావాకి ప్లాంటేషన్ చేపట్టామన్నారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్దతుగా, ఈరోజు తన జన్మదినం పురస్కరించుకొని మేయర్ విజయలక్ష్మి మొక్కలు నాటారు. లోటస్ పాండ్ లోని పార్కు వద్ద రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఖైర్‌తాబాద్ నియోజకవర్గ MLA దానం నాగేందర్, సినీ నటుడు తరుణ్‌లతో కలిసి మొక్కలు నాటారు.