Sunday, September 8, 2024
HomeTrending Newsఒక్కసారి అధికారం ఇవ్వండి: బండి

ఒక్కసారి అధికారం ఇవ్వండి: బండి

Give us Power:
రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి తమ పార్టీకి అధికారం ఇచ్చి చూడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అది ఒక్క బిజేపితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఆమనగల్ నుంచి పెద్ద సంఖ్యలో యువకులు బండి సంజయ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ ప్రసంగిస్తూ రాత్రిపూట నిర్ణయాలు తీసుకునే ఏకైక ముఖ్యమంత్రి దేశం మొత్తంలో కేసిఆర్ ఒక్కరేనని, అసలు కేబినేట్ అంతా నామమాత్రమేనని, ఒక్క రోడ్డును మంజూరు చేసే అధికారం లేని వ్యక్తి రోడ్ల మంత్రిగా ఉంటారని వ్యాఖ్యానించారు. బాగా చదువుకొని ఐఏఎస్ అయి, ప్రజలకోసం పనిచేసే అధికారులకు లూప్ లైన్ పోస్టింగ్ లు ఇస్తారని, ఆయనకు భజన చేసేవారికే మంచి పోస్టింగ్ లు ఇస్తున్నారని బండి ఆరోపించారు. అయన పథకాలన్నీ అయితే పెళ్లి కోరతారు- లేకపోతే చావు కోరతారు అన్నట్లు ఉంటాయని ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకులు కేసియార్, కేటియార్ తీవ్ర అసహనంతో ఉన్నారని సంజయ్ అన్నారు.

స్వార్ధం కోసం పార్టీలోకి వచ్చే వారిని చేర్చుకోబోమని, ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వాసంతో పాటు, తమ పార్టీ సిద్ధాంతాలను నమ్మి వస్తేనే చేర్చుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు విఠల్, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరారని చెప్పారు. భవిష్యత్తులో టిఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ ఎంపీలకు వేడుకలు ఉండి పార్లమెంట్ సమావేశాలను బాయ్ కాట్ చేశారని ఎద్దేవా చేశారు.  కెసిఆర్ ఎప్పుడు ఎక్కడ సంతకం చేస్తారో తెలియడం లేదని,  కృష్ణానదీ జలాల విషయంలో 299 టిఎంసిలకు, ధాన్యం 40 లక్షల టన్నులకు ఒప్పుకొని సంతకం చేశారని గుర్తు చేశారు.

Also Read :  శాతవాహన వర్సిటీకి 12-బి హోదా: బండి

RELATED ARTICLES

Most Popular

న్యూస్