Saturday, January 18, 2025
HomeసినిమాOG Poster: సెప్టెంబర్ 2 న అగ్ని తుఫాను

OG Poster: సెప్టెంబర్ 2 న అగ్ని తుఫాను

పవన్ కళ్యాణ్ హీరోగా ‘సాహో’ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఓజీ. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల తర్వాత సుజిత్ రూపొందిస్తోన్న మూడో సినిమా ఇది . పవన్ కళ్యాణ్ తో  అవకాశం అందిపుచ్చు కున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ యాభై శాతం  షూటింగ్ పూర్తి చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఓజీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఈరోజు మేకర్స్  ఓజీ మూవీపై  ఫ్యాన్స్ ఖుషి అయ్యే అప్ డేట్ ఇచ్చారు.

ఓజీ మూవీ నుంచి అగ్నితుఫాను సెప్టెంబర్ 2న రానుందని తెలియచేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌‌లో ఓ చోట
లొకేషన్ చర్చి గేట్ సౌత్ బొంబాయి.
టైమ్ ఉద‌యం 2 :18,
వర్షపాతం సాంద్రత 24 మి.మీ,
రక్తపాతం సాంద్రత 34 మి.మీ.
వాడిన ఆయుధాలు : డబుల్ బారెల్ షాట్‌గన్ ….అని రాసి ఉంది.

ఈ పోస్టర్‌‌ను సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ షేర్ చేసింది. హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ‘అగ్ని తుఫాను సెప్టెంబర్ 2న వస్తోంది. ఓజీ అభిమానులారా ధైర్యంగా ఉండండి’ అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓజీ గ్లింప్స్ రిలీజ్ చేయనున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్