Sunday, January 19, 2025
Homeసినిమాయాక్షన్ షూటింగ్ లో గాడ్ ఫాద‌ర్

యాక్షన్ షూటింగ్ లో గాడ్ ఫాద‌ర్

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన ‘లూసీఫ‌ర్’ కి రీమేక్ ఇది.  తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ద‌స‌రాకి ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ప్రస్తుతం మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ షూట్ లో మెగాస్టార్ చిరంజీవితో సహా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నట్టు స‌మాచారం. పైగా ఈ షూట్ నుంచి ఓ క్రేజీ సీన్ పిక్ కూడా బయటకి వచ్చింది. ఇది అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

స‌ల్మాన్ ఖాన్, పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్స్ చేస్తుండ‌డంతో ఈ సినిమా కోసం అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఆచార్య సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో గాడ్ ఫాద‌ర్ మూవీ పై అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. గాడ్ ఫాద‌ర్ ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో.. ఎలాంటి స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్