Saturday, March 14, 2026
HomeTrending Newsశ్రీ గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం

శ్రీ గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం

దేవీ నవరాత్రులలో భాగంగా నేడు అక్టోబర్ 9న శనివారం మూడోరోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా.. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి. ఈ అలంకారంలో అమ్మను దర్శించుకుంటే ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం

తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో, రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా భక్తులకు భక్తులకు ఆశీస్సులు అందించారు.

10-10-2021 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి

11-10-2021 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి

12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం)

13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి)

14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి)

15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి)

11-10-2021తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

12వ తేదీ మూలా నక్షత్రం రోజున సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular