Saturday, March 14, 2026
HomeTrending Newsబాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రుల రెండవ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో భక్తులకు ఆశీస్సులు అందించారు.

9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి. 10-10-2021 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి. 11-10-2021 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి. 12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం). 13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి). 14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి). 15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).   11-10-2021తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందని ఆలయ అధికారులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular