Golkonda Bonalu 2022 :గోల్కొండ ఆషాఢ మాసం బోనాలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్ లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీలు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. జులై 17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు, 18న రంగం, భవిష్యవాణి ఉంటుంది. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు ఉంటుంది. ఇక ఈనెల 28న బోనాలు ముగుస్తాయి. బోనాల పండుగను ఘనంగా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని తెలిపారు. కల్చరల్, లైటింగ్, LED స్క్రీన్‌లతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో పటిష్ట బందోబస్తు మధ్య బోనాల జాతర నిర్వహించాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా బోనాల వేడుకల్ని నిర్వహిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం తరపున వివిధ ఆలయాలలో అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందని, 3 వేల కు పైగా దేవాలయాలకు 15 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపున అందిస్తున్నట్టు మంత్రి తలసాని తెలిపారు.
Also Read : జూలైలో పాతనగర బోనాలు