మహేష్ బాబు, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే సినిమా మహేష్ బాబుతోనే అని రాజమౌళి ప్రకటించారు. అప్పటి నుంచి ఈ మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో హాలీవుడ్ మేకర్స్ ని సైతం మెప్పించడం.. ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకోవడంతో మహేష్ బాబుతో చేసే మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ మహేష్ బాబుకు కరెక్ట్ గా సరిపోయే స్టోరీ రెడీ చేస్తున్నారు. తాజగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… రాజమౌళి మహేష్ బాబుతో చేసే సినిమాని అందరి అంచనాలు మించేలా తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీలో మెసేజ్ లు వంటివి ఉండవని, ఇంటిల్లిపాది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీగా రూపొందనుందని తెలియచేశారు.
నిజానికి ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కారణం ఏంటంటే.. గత కొన్నాళ్లుగా మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట.. ఇలా తను చేసిన సినిమాల్లో ఎక్కువగా మెసేజ్ ఉంటుంది. ఈసారి రాజమౌళి.. మహేష్ తో చేసే సినిమాలో మెసేజ్ లు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసే స్టోరీతో సినిమా చేయనున్నారని చెప్పారు. ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండే అడ్వంచరస్ మూవీ అని చెప్పడంతో ఈ సినిమాతో చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరి.. మహేష్, రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.
Also Read : మహేష్, త్రివిక్రమ్ మూవీకి టైటిల్ ఫిక్స్ అయ్యిందా..?