Sunday, January 19, 2025
HomeTrending Newsవిజయ డైరీ రైతులకు శుభవార్త

విజయ డైరీ రైతులకు శుభవార్త

విజయ డెయిరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డెయిరీ పాల సేకరణ ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్  రాజేంద్రనగర్‌లో ఈ రోజు పాడి రైతుల అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు మంత్రి శుభవార్త తెలిపారు. పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు ప్రకటించారు. లీటర్‌ గేదె పాల ధరను రూ.46.69 నుంచి రూ.49.40కు పెంచున్నట్లు పేర్కొన్నారు. ఆవు పాల ధరను రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుదని చెప్పారు. పాడి గేదెలకు ఉచితంగా మందులు, వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని తెలంగాణ ఏర్పాటు తర్వాత లాభాల్లోకి వచ్చిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్