సికింద్రాబాద్ కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంత్రి కేటీఆర్ పలుసార్లు కేంద్రాన్ని కోరారు. కంటోన్మెంట్ తో నగర అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రానికి విన్నవించారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనంపై కసరత్తు మొదలుపెట్టింది. కేంద్రం నిర్ణయంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.