Tuesday, February 25, 2025
HomeTrending NewsKesamudram: గూడ్స్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

Kesamudram: గూడ్స్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం సమీపంలో గూడ్స్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్‌ల మధ్య విజయవాడ నుంచి కాజీపేట వెళ్తున్న గూడ్సు రైలు లింకు తెగిపోయింది. దీంతో గూడ్స్‌ గార్డ్‌ బోగీతోపాటు మరో బోగీని వదిలి ఇంజిన్‌ వెళ్లిపోయింది.

అయితే అప్రమత్తమైన గార్డ్‌.. వెంటనే లోకో పైలట్‌కు సమాచారం అందించాడు. దీంతో కిలోమీటరు దూరం వెళ్లిన తర్వాత లోకోపైలట్‌ రైలును ఆపేశాడు. మళ్లీ వెనక్కి వచ్చి విడిపోయిన బోగీలతో లింకు తగిలించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ నెల 2న ఒడిశాలోని బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్‌లో మూడు రైళ్ల ఢీకొన్న తర్వాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
RELATED ARTICLES

Most Popular

న్యూస్