Sunday, January 19, 2025
Homeసినిమా‘ఆధారం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

‘ఆధారం’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని మొదటి సారి హీరోగా ‘కేటుగాడు’ ద్వారా పరిచయం చేసిన నిర్మాత శ్రీ వల్లూరిపల్లి వెంకట్రావు  వారసురాలు చిరంజీవి సితార వెల్లూరిపల్లి సమర్పణలో శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ పతాకం పై సూర్య భరత్ చంద్ర, రేణు శ్రీ (నూతన పరిచయం) , నిరోషా (ప్రముఖ మోడల్ బెంగళూరు) హీరో, హీరోయిన్లుగా గోపి పోలవరపు స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఆధారం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను  హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు  చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ “ఈ చిత్ర దర్శక, నిర్మాత గోపి గారు ఎప్పుడు మా సినిమాలను ఆదరిస్తుంటాడు. అందుకే ఇప్పుడు తను తీస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు పిలవగానే వచ్చాను. గోపి గారు కొత్త కథలతో కొత్త టాలెంట్ ని బయటకు తీసుకురావాలని ఎప్పటినుంచో నాతో అనేవాడు. ఆ క్రమంలోనే ఈ ‘ఆధారం’ సినిమాలో కూడా కొత్త నటీ నటులతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లవ్ ఎమోషన్, థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకురావాలి.  ఈ సినిమా పాటలు చాలా బాగా ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించి గోపి గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్