Saturday, January 18, 2025
Homeసినిమాక్లైమాక్స్ తో మార్కులు కొట్టేసిన 'భీమా' 

క్లైమాక్స్ తో మార్కులు కొట్టేసిన ‘భీమా’ 

గోపీచంద్ హీరోగా రూపొందిన ‘భీమా’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా మాళవిక శర్మ – ప్రియా భవాని శంకర్ నటించారు. కెకె రాధామోహన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు. గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఈ సినిమా, రిలీజ్ కి ముందు గట్టి బజ్ నే తెచ్చుకుంది.

గోపీచంద్ తన కెరియర్ ఆరంభంలో ఫ్యాక్షన్ నేపథ్యంలోని కథలను .. మాస్ యాక్షన్ కథలను ఎక్కువగా ఎంచుకుంటూ వచ్చాడు. ఆ తరువాత ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ వైపు దృష్టి పెట్టాడు. అప్పటి నుంచి గోపీచంద్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మొదలలైంది. అలాగే ఈ సినిమా కథ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగేలా ఆయన చూసుకున్నాడు. ద్విపాత్రాభినయం కూడా చేశాడు. రెండు పాత్రల మధ్య వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే పోలీస్ ఆఫీసర్ లుక్ కి ఎక్కువ మార్కులు పడతాయి.

దర్శకుడు పోలీస్ ఆఫీసర్ పాత్రను రాసుకున్నట్టుగా, గోపీచంద్ కి సంబంధించిన మరో పాత్రను  రాసుకోలేకపోయాడు. అందువలన మొదటి ట్రాక్ అంతటి బలంగా ఈ ట్రాక్ కనిపించదు. కాస్త కసరత్తు చేసి ఉంటే మరింత బాగా పండేది అనిపిస్తుంది. ఇక ద్విపాత్రాభినయంతో కూడిన సినిమాల్లో క్లైమాక్స్ అనేది చాలా దగ్గర దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. డైరెక్టర్ ప్లాన్ చేసుకున్న క్లైమాక్స్ కథకు మరింత బలాన్ని తెచ్చింది .. ఆడియన్స్ ను మెప్పిస్తుంది. మహా శివరాత్రికి రిలీజ్ చేద్దామనే ఆలోచన ముందుగా చేయకపోయినా, శివుడి నేపథ్యంలోని సీన్స్ కలిసొచ్చాయి. కాస్త కామెడీని కూడా తోడు చేసుకున్న ఈ సినిమా, యాక్షన్ వైపు నుంచి గోపీచంద్ ఫ్యాన్స్ కి ఎక్కేస్తుందనే  చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్