Monday, March 16, 2026
Homeసినిమాగోపీచంద్ మార్క్ మాస్ యాక్షన్ మూవీగా 'భీమా'

గోపీచంద్ మార్క్ మాస్ యాక్షన్ మూవీగా ‘భీమా’

గోపీచంద్ కథానాయకుడిగా ‘భీమా’ అనే సినిమాను హర్ష రూపొందించాడు. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమా, టైటిల్ పోస్టర్ నుంచి అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ లుక్ కూడా ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది. నిన్ననే ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడంలో టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎద్దుపై కూర్చుని  గోపీచంద్ ఇచ్చిన ఎంట్రీ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

కొంతమంది దుర్మార్గులకు మరికొంతమంది దుష్టులు ఆశయం ఇస్తుంటారు .. అండగా నిలబడుతూ ఉంటారు. వాళ్లు పోలీస్ వ్యవస్థను కూడా భయపెడుతూ బ్రతికేస్తుంటారు. కానీ అలాంటి అక్రమార్కులను ఏరి పారేయడానికి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనేదే ‘భీమా’ కథ. రాక్షసులను సంహరించడానికి బ్రహ్మరాక్షసుడిగా మారవలసిందే అనేది కాన్సెప్ట్.  పొగరెక్కిన ఎద్దునే లొంగదీసిన తనకి, ఈ ఆకు రౌడీలు ఎంత? అనే హింట్ ఇస్తూ, ఎద్దుపై పోలీస్ డ్రెస్ లోనే హీరో రావడం టీజర్లో చూపించారు.

ఈ సినిమాలో లుక్ పరంగా గోపీచంద్ కొత్తగా కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలకి ఆయన ఎంత పెర్ఫెక్ట్ గా సరిపోతాడనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కొంతకాలంగా గోపీచంద్ కి హిట్ పడలేదు. ఈ ఏడాది ఆరంభంలో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ప్రియా భవానీ శంకర్ – మాళవిక శర్మ ఆయన సరసన కథానాయికలుగా కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular