‘సౌత్ కా సత్తా మార్ కే నై.. సీటీమార్ కే దిఖాయేంగె` అని సవాలు విసురుతున్నారు ఎగ్రెసివ్ హీరో గోపీచంద్. అసలు గోపీచంద్ ఆ రేంజ్‌లో ఎందుకు ఛాలెంజ్ విసిరారో అర్థం చేసుకోవాలంటే `సీటీమార్` సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మాస్ డైరెక్టర్ సంపత్ నంది, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. సెప్టెంబర్ 10న బాక్సాఫీస్‌తో కలెక్షన్స్ కబడ్డీ ఆడటానికి సిద్ధమైన భారీ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా `సీటీమార్`. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకులకు పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న `సీటీమార్` ట్రైలర్‌ను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే.. ‘ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్సా….నీకు రూల్స్ తెలుసు కదా` అని కబడ్డీ కోచ్ గోపీచంద్‌ను సెలక్టర్ ప్రశ్నిస్తే.. ‘రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్.. రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు’ అని గోపీచంద్ తనదైన స్టైల్లో చెప్పిన మాస్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘త్వరలోనే నేషనల్ కబడ్డీ ఉంది.. అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది. అప్పుడు మన కష్టం గురించి చెబితే దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది’ అని గోపీచంద్ తన టీమ్ సభ్యులకు చెప్పడం మరో డైలాగ్.
పవర్‌ఫుల్ డైలాగులతో పాటు గోపీచంద్ యాక్షన్, కబడ్డీ ఆడే అమ్మాయిలు ఎంత బాగా ఆడారనే కొన్ని సన్నివేశాలు.. సీటీమార్ అనే బ్యాగ్రౌండ్‌లో వినిపించే టైటిల్ ట్రాక్ ఇవన్నీ సినిమాలో యాక్షన్, భారీతనంతో పాటు స్త్రీ సాధికారత గురించి మంచి మెసేజ్ ఉన్నట్లు అనిపిస్తుంది. గోపీచంద్ మాస్ హీరోయిజం, తమన్నా గ్లామర్‌తో పాటు.. ఈ సినిమాలో మంచి పెర్ఫామెన్స్ రోల్ చేసిందని తెలుస్తుంది. ఇక దర్శకుడు సంపత్ నంది.. మరోసారి తనదైన మార్క్ మూవీని భారీ లెవల్లో, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కించాడు. ట్రైలర్ ఈ రేంజ్‌లో ఉంటే ఇక వినాయక చవితికి సినిమా అసలు పండగతో థియేటర్లలో మజాను అందించడం ఫిక్స్ అనిపిస్తుంది.