రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ,బీసీ,ఎస్సి, ఎస్టీ,మైనార్టీ గురుకుల విద్యాలయాలు మినహా మిగిలిన తరగతులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. తల్లిదండ్రుల నుండి ఎలాంటి కాన్సెన్ట్ లెటర్ తీసుకోవద్దు… అది చెల్లదని విద్యాశాఖ స్పష్టం చేసింది. తరగతులకు హాజరు కావాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు. విద్యార్థుల హాజరుపై పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను వత్తిడి చేయకూడదు.
స్కూల్ మేనేజ్ మెంట్ ఆన్లైన్, ఆఫ్ లైన్, రెండు విధాలుగా తరగతులు నిర్వహించవచ్చు. ఇప్పటికే జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పాఠశాలల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో పాఠశాల విద్యా శాఖ ప్రత్యక్ష తరగతుల నిర్వహణ పై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది.