Saturday, January 18, 2025
HomeTrending Newsవాయిదా వేసుకోవాల్సింది: బొత్స

వాయిదా వేసుకోవాల్సింది: బొత్స

follow the system: వ్యవస్థలకు అనుగుణంగా మనం నడచుకోవాలి గానీ, వ్యక్తుల కోసం వ్యవస్థలు నడవలేవని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం  చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

సినిమా టికెట్ రెట్ల విషయమై ప్రభుత్వం ఓ కమిటీని నియమించామని, దాని నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరిస్తుంది తప్ప, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సడలింపులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సినిమా రంగం సమస్యలపై తొలుత చిరంజీవి, ఆ తర్వాత ఆయన  నేతృత్వంలోని ప్రతినిధి బృందం సిఎం జగన్ ను కలుసుకున్నారని, టికెట్ రేట్ల విషయంలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడున్న టిక్కెట్ ధరలు నచ్చకపోతే సినిమా విడుదలను వాయిదా వేసుకొని ఉండాల్సిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్