Sunday, May 4, 2025
HomeTrending NewsChandrababu: రైతు మెడకు ఉరి వేశారు: బాబు ఫైర్

Chandrababu: రైతు మెడకు ఉరి వేశారు: బాబు ఫైర్

రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని, ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే రైతులను అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు.  పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రైతు పోరుబాట యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. తాము ఆల్టిమేటం ఇచ్చిన తరువాత ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. రైతుల ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలేని అసమర్ధ ప్రభుత్వమని, రైతుల జీవితాలతో ఆడుకొనే హక్కు ఈ సిఎంకు ఎవరిచ్చారని బాబు ప్రశ్నించారు.   ఐదేళ్ళు అధికారం ఇచ్చిన పాపానికి రైతు మెడకు ఉరి వేశారని బాబు మండిపడ్డారు.

ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దామని, రైతులకు పరిహారం ఎలా ఇవ్వడో చూద్దామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిహారం ఇవ్వకపోతే రాబోయే ప్రభుత్వంలో తాము అందజేస్తామని భరోసా ఇచ్చారు.  సిఎం జగన్ దుర్మార్గపు పాలన చేస్తున్నాడని, రైతులను కలుద్దామని వస్తుంటే అడ్డుకున్తున్నాడని, రైతులను అదుపులోకి తీసుకుంటున్నారని, దీనిపై రైతులు కూడా ఎదురు తిరగాలని… ప్రభుత్వంపై పోరాటంలో తనకు అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు.  14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసి నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న తనపైనే దాడి చేస్తున్నారంటే రైతులు ఒక లెక్కా అని బాబు ప్రశ్నించారు. తన ఒక్కడి బలమే సరిపోదని అందరూ కలిసి రావాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్