Friday, September 27, 2024
HomeTrending NewsIdem Kharma: పులివెందుల కూడా మాదే: చంద్రబాబు

Idem Kharma: పులివెందుల కూడా మాదే: చంద్రబాబు

Babu: తన కర్నూలు పర్యటనతో వైఎస్సార్సీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని,  అందుకే ఎనిమిది మంది జిల్లా పార్టీ అధ్యక్షులను మార్చారని, మరికొంతమంది మాకు పదవులు వద్దంటూ వెళ్లిపోతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు.  తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని స్పందన ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు టూర్ లో చూశానని భావోద్వేగంతో వెల్లడించారు. ఆ పార్టీ నేతలే కాడి పారేసి వెనక్కు తగ్గుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే కనీసం పులివెందులో కూడా వైసీపీ గెలవబోదని, ఆ పార్టీకి గుండు సున్నా అంటూ ఎద్దేవా చేశారు.  ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకు వస్తామని, భయపడితే బానిస బతుకులేనని,  మనం కూడా పోరాడితే వారు తప్పకుండా వెనక్కు తగ్గుతారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ‘ఇదేం ఖర్మ – ఆక్వా రంగానికి’ పేరుతో మంగళగిరి తెలుగుదేశం పార్టీకేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సంక్షోభంలో ఉన్న అక్వారంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏదైనా రంగం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. సీడ్, ప్రాసెసింగ్ ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వస్తోందని అది సరికాదని వ్యాఖ్యానించారు. ఆక్వా రైతులు అప్పులపాలై బాధలు పడుతుంటే సిఎం జగన్ ఆనందిస్తున్నారని అన్నారు.  సీడ్ యాక్ట్ తెచ్చి విత్తనాలు అమ్మేవారిని తమ అధీనంలోకి తెచుకున్నారని, వాటాల కోసమే ఈ పని చేశారని, దీని వల్ల కూడా రైతులకు అన్యాయం జరిగిందన్నారు.

టిడిపి అధికారంలో వచ్చే నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 4.3 శాతం వాటా  ఆక్వా రంగానికి ఉంటే, తాము 7.4శాతానికి తీసుకు వెళ్ళమని గుర్తు చేశారు.  ఆక్వా రంగానికి  తమ ప్రభుత్వంలో 4.86 రూపాయలుగా ఉన్న యూనిట్ విద్యుత్ ను రెండు రూపాయలు చేశామని, కానీ జగన్ రూపాయిన్నరకు ఇస్తానని చెప్పగానే అందరూ ఏమారి ఓటేశారని, జగన్ వేసిన ఎరలో మీరు చుక్కుకున్నారని బాబు చమత్కరించారు. అర్ధరూపాయి కోసం మోసపోయి ఇప్పుడు మనుగడ కోల్పోయి స్తితికి చేరుకున్నారని అన్నారు. ఆక్వా రైతులకు నీటి పన్ను వెయ్యి లీటర్లకు తాము 12 రూపాయలు వసూలు చేస్తే… ఇప్పుడు 120 రూపాయలు అయ్యిందని అంటే పదిరెట్లు రేటు పెంచారని అన్నారు.

రాష్ట్రంలో రైతాగం పరిస్థితి దయనీయంగా ఉందని, జాతీయ స్థాయిలో  రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం, రంగం కూడా సంతోషంగా ఉండడం సిఎంకు ఇష్టం లేదని, ఎవరి దగ్గరా పది రూపాయలు కూడా ఉండడం ఇష్టం లేదని పేర్కొన్నారు.  వచ్చే ఎన్నికల్లో ఐదు వేల రూపాయలు ఇచ్చి, మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు.

Also Read : అభద్రతా భావంలో సిఎం: చంద్రబాబు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్