Wednesday, March 26, 2025
HomeTrending Newsపంచాయతీల ప్రోత్సాహకాలు విడుదల

పంచాయతీల ప్రోత్సాహకాలు విడుదల

Incentives released: ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు రూ. 134. 95 కోట్లు ప్రోత్సాహక నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా షుమారు 12,900 గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరి నెలఎన్నికలు జరిగాయి. వీటిలో 2,001 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. గ్రామ పంచాయతీల్లోని జనాభా ప్రాతిపతికన ప్రభుత్వం ఆయా పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

రెండు నుంచి ఐదు వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు; ఐదు నుంచి పదివేల జనాభా ఉన్నగ్రామాలకు రూ.15 లక్షలు, 10 వేలకుపైన జనాభా ఉన్న గ్రామాలకు రూ.20 లక్షల వంతున ప్రోత్సాహకాలను ఇస్తామని తెలిపింది. ఈ పంచాయతీలకు నేడు నిధులు విడుదల చేసింది.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 358 పంచాయతీలు ఏకగ్రీవం కాగా; వైఎస్సార్ కడప జిల్లాలో248;  గుంటూరులో జిల్లాలో245; ప్రకాశం జిల్లాలో 192 పంచాయతీల పాలక వర్గాలు పోటీలేకుండా ఎన్నికయ్యాయి.

Also Read : సదుం మండలంలో పెద్దిరెడ్డి పల్లెబాట

RELATED ARTICLES

Most Popular

న్యూస్