Friday, September 20, 2024
HomeTrending Newsతిరుమల నుంచే ప్రక్షాళన మొదలు

తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు

తిరుమల వెంకటేశ్వరస్వామికి  అపకారం తలపెడితే ఈ జన్మలోనే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని, గతంలో కూడా కొంతమంది తప్పులు చేసి అనుభవించారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయంలో తిరుమల పవిత్రతను నాశనం చేశారని ఆవేశం వ్యక్తం చేశారు. పైరవీలకు కేంద్రంగా మార్చారని, పెళ్లిళ్లకు, పేరంటాలకు కూడా స్వామిని తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం పదవులు కట్టబెట్టి, వాటి ద్వారా వారి కోర్టు కేసుల కోసం వినియోగించుకున్నారని మండిపడ్డారు. దివ్య క్షేత్రాన్ని ఎంతో అపవిత్రం చేశారని…. గంజాయి, డ్రగ్స్, లిక్కర్, నాన్ వెజ్, అన్యమత ప్రచారంతో భ్రష్టు పట్టించారని, స్వామిని వారి స్వార్ధం కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు.డా అభివృద్ధిలో ఏపీ 3౦ ఏళ్ళు వెనక్కి పోయిందని, తిరుమల ప్రక్షాళనతోనే తమ పాలన మొదలు పెడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కుటుంబంతో కలిసి  తిరుమల చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం స్వామి వారి దర్శించుకున్నారు, అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు.

కొండ ఎక్కగానే ఓ పవిత్రమైన భావన రావాలని కానీ, ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా!, ఓం నమో వేంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండకూడదని..  కానీ న్ని చెడగొట్టారని విమర్శించారు. గతంలో ఎంతో పరిశుభ్రంగా ఉండేదని, ఔషధ మొక్కలు పెంచి, ఇక్కడకు రాగానే మనిషి లైఫ్ టైమ్ పెరిగేలా చేశామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్