Thursday, March 19, 2026
HomeTrending Newsబాబు హయంలో ఫైబర్‌నెట్‌ అక్రమాలు

బాబు హయంలో ఫైబర్‌నెట్‌ అక్రమాలు

చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బ్లాక్‌ లిస్టులో ఉన్న తేరా సాఫ్ట్ కంపెనీకి టెండర్‌ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్‌ ఉన్నా.. రెండు నెలల్లోనే టెండర్‌ కట్టబెట్టారన్నారు.  సంస్థకు టెండర్‌ కేటాయించేందుకే కాల పరిమితి పొడిగించారన్నారు. చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రక్రియలో దాదాపు 121 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయన్నారు.

వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను టెరా సాఫ్ట్ లో రాజీనామా చేయించి ఫైబర్‌నెట్‌లో డైరెక్టర్‌గా తీసుకున్నారని, టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసిందని. దర్యాప్తు  పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావొచ్చని గౌతమ్‌రెడ్డి అన్నారు. బాధ్యులపై సిఐడి చర్యలు తీసుకుంటుందని గౌతమ్ రెడ్డి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular