APPSC Boss: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గా మాజీ డిజిపి గౌతమ్ సావాంగ్ నియమితులయ్యారు. రెండ్రోజుల క్రితం డిజిపి పదవి నుంచి బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సావాంగ్ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆయన్ను పదవి నుంచి తొలగించారని….. మరోవైపు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అయన స్వయంగా రిలీవ్ చేయమని అడిగారని రకరకాల వార్తలు వచ్చాయి.
డిజిపి పదవి నుంచి బదిలీ చేసిన తరువాత ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించడం ఆయన్ను అవమానించడమేనని ప్రతిపక్ష టిడిపి కూడా విమర్శలు చేసింది.
నేడు ఆయన్ను ఏపీపీఎస్సీఛైర్మన్ గా నియమించడంతో విమర్శలకు చెక్ పడినట్లయ్యింది.
Also Read : గౌతమ్ సావాంగ్ పై బదిలీ వేటు