Gowthams New Movie:
కొత్త తరహా కథలతో ప్రేక్షకులకు దగ్గరయిన గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకం పై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీతో సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం కాబోతున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ ను తెర మీద పరిచయం చేయబోతున్నారు.
మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్ కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు? అనే కథాంశంతో సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గౌతమ్ హీరో గా రూపొందుతున్న ఈ మూవీకి యస్ ఒరిజినల్స్ లోనే దర్శకుడి గా పరిచయం కాబోతున్న విశ్వ క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ : సృజన్ యారబోలు, రచన దర్శకత్వం : సుబ్బు చెరుకూరి, సినిమాటోగ్రఫీ : మోహన్, మ్యూజిక్ : శ్రీరామ్ మద్దూరి, ఎడిటర్ : కె. సంతోష్
Also Read : ‘పుష్ప ది రైజ్’ ఏయ్ బిడ్డ పాటకు సూపర్ రెస్పాన్స్