Sunday, January 19, 2025
HomeTrending Newsరికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

Grain Procurement In Telangana :

రికార్డు స్థాయిలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు మంత్రి గంగుల, ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన పౌరసరఫరాల శాఖ వానాకాలం కొనుగోళ్లలో ఆల్ టైమ్ రికార్డు స్రుష్టించింది, రాష్ట్రంలో ఇంకా 20 శాతం కోతలు మిగిలి ఉండగానే ఇంత ధాన్యాన్ని సేకరించామని, ఐతే కేంద్రం కేవలం 59.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా 40 లక్షల క్వింటాళ్ల బియ్యానికి మాత్రమే కొనుగోలుకు అనుమతించిన నేపథ్యంలో రేపో మాపో ఆ టార్గెట్ని చేరుకుంటామని, ఇంకా అంచనాల మేరకు రాబోయే దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణ ఎలా చేయాలనే దానిపై సివిల్ సప్లైస్ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఇదే విషయమై మంత్రి గంగుల కమలాకర్ ఈ రోజు సీఎం కేసీఆర్ తో జరగబోయే సమావేశంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిగారిని కోరతానన్నారు ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.
తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు, కాళేశ్వరంతో అందుబాటులోకి నీరు, నిరంతరాయంగా 24గంటల ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతుబందు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచడంతో గణనీయమైన దిగుబడులు వస్తున్నాయని మంత్రి గంగుల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం ధాన్యం సేకరణ కోసం 6846 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేస్తున్నామని, ఎఫ్.సి.ఐ నిర్దేశించిన ప్రమాణాల మేరకు కొనుగోల్లను చేపడుతున్నామన్నారు, వివిద జిల్లాల్లో ఇప్పటికే 1982 కొనుగోలు కేంద్రాలను మూసివేసామని, మిగతా కేంద్రాల్లో నిరంతరాయంగా కొనుగోళ్లు సాగుతున్నాయన్నారు,

ఇప్పటివరకూ జిల్లాల వారీగా మూసివేసిన కొనుగోలు కేంద్రాల వివరాల్ని వెల్లడించారు మంత్రి గంగుల. నిజమాబాద్లో -424, మెదక్ 375, కామారెడ్డి 287, కరీంనగర్లో 283, సంగారెడ్డి 142, రాజన్న సిరిసిల్ల 117, సూర్యాపేట 22, నల్గొండ 23, మేడ్చల్ మల్కాజ్కిరి 1, పెద్దపల్లి 52, జగిత్యాల 96, యాదాద్రి భువనగిరి 19, నిర్మల్ 68, సిద్దిపేట 73, కొనుగోలు కేంద్రాలు మూసివేసామన్నారు.
కేంద్రం తెలంగాణ రైతాంగంపై పూర్తి నిర్లక్ష్యంతొ వ్యవహరిస్తున్నందున ఎదురైతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్దితో క్రుషిచేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Also Read :  తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం

RELATED ARTICLES

Most Popular

న్యూస్