Sunday, January 19, 2025
HomeTrending Newsలండన్ లో మంత్రి కేటిఆర్ కు ఘనస్వాగతం

లండన్ లో మంత్రి కేటిఆర్ కు ఘనస్వాగతం

యునైటెడ్ కింగ్డమ్ మరియు దావోస్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి లండన్ చేరుకున్న మంత్రి కే తారకరామారావు కి ఘన స్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యూకే కి చెందిన టిఆర్ఎస్ పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు, పలువురు మంత్రి కేటీఆర్ కి స్వాగతం పలికారు. యూకేలో 4నాలుగు రోజులపాటు పర్యటనకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో లండన్ విమానాశ్రయంలో కోలాహలం నెలకొంది.

అనేక మంది తమ కుటుంబ సభ్యులతో సైతం విమానాశ్రయానికి చేరుకుని కేటీఆర్ కి పూల గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ తో ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. మంత్రి కేటీఆర్ బుధవారం నుంచి అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కేటీఆర్ కి లండన్ లో స్వాగతం పలికారు.

Also Read : తెలంగాణ.. పట్టణ రాష్ట్రం – మంత్రి కేటిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్