బడుగు బలహీనవర్గాలను నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ సిఎం జగన్ ఆప్యాయంగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అన్నారు. పేద పిల్లలకు జగనన్న మేనమామగా మారి అమ్మఒడి పథకంతో పేదలపై చదువుల భారం పడకుండా చేశారని వెల్లడించారు. ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి ముఖ్యమంత్రిని మన అణగారిన వర్గాలు, పేదలు చూసి ఉండరని స్పష్టం చేశారు.
మడకశిరలో సామాజిక సాధికారత పరిఢవిల్లింది. జగనన్న అండతో తాము సాధించిన సాధికారతను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నేతలు ప్రజలకు విరించారు. బైక్ ర్యాలీలో భారీగా శ్రేణులు పాల్గొన్నాయి. మడకశిర ఎమ్మెల్యే డా. తిప్పేస్వామి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జయరాం, ఎంపీలు గోరంట్ల మాధవ్, నందిగం సురేష్, ఎమ్మెల్యే శంకరనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ… చంద్రబాబు మోసపూరిత మాటలతో మళ్లీ మన ముందుకు వస్తున్నారని, ఆయనకు తోడుగా తానున్నానంటూ పవన్‌కళ్యాణ్ అంటున్నారని, ఈ తోడుదొంగల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగనన్న పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదాలు చూడకుండా అర్హులందరికీ పథకాలు అందుతున్నాయని, అసలు సిసలు ప్రజల మనిషి జగన్ అని కొనియాడారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నాలుగున్నరేళ్లలో సిఎం జగన్ ఎంతో మేలు చేశారని, అటు సంక్షేమ పథకాలతో వారి ఆర్థిక స్థాయిని పెంచారని, ఇటు అధికార పదవుల్లో పెద్దపీట వేశారని ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి వెల్లడించారు. నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం వారికే ఇచ్చారుని, బడుగు, బలహీనవర్గాలతో పాటు మహిళలకు పెద్ద ఎత్తున చేయూతనందించారని ప్రశంసించారు. వెనుకబడిన మడకశిర నియోజకవర్గంపై నాడు వైయస్సార్ పై ఎంతో ప్రేమ చూఫై అభివృద్ధి చేసి తీరాలని తపించారని, నీటి కొరత తీర్చేందుకు ఎంత ఖర్చయినా వెనకడుగు వేయలేదని గుర్తు చేసుకున్నారు. వైయస్సార్‌లానే ఆయన తనయుడు జగన్ కూడా మన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అనేక పథకాల ద్వారా ఎంతో మేలు చేశారని వివరించారు.