Sunday, March 15, 2026
Homeసినిమాస్పై థ్రిల్ల‌ర్ ‘గ్రే’ షూటింగ్ పూర్తి

స్పై థ్రిల్ల‌ర్ ‘గ్రే’ షూటింగ్ పూర్తి

Grey Shoot Completed:
ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీ రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై. లిమిటెడ్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం `గ్రే`.  స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ‘ద స్పై హూ ల‌వ్డ్ మి’ అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కుతోన్నఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ లో గుమ్మ‌డికాయ కొట్టింది చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభంకానున్నాయి.

ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజ్ మాట్లాడుతూ “మా `గ్రే` స్టైలిష్‌ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు, ట‌ర్నుల‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. ప్రధాన పాత్రలన్నిటికీ మంచి స్కోప్ ఉంటుంది. హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన లొకేష‌న్స్ లో 20 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జ‌రిపాం. నిర్మాత కిర‌ణ్ పూర్తి స‌హ‌కారం అందించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభంకానున్నాయి. ఔట్‌పుట్ ప‌ట్ల మా టీమ్ అంద‌రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త‌ప్ప‌కుండా ఒక డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను” అన్నారు.

Also Read : ప్రేక్షకులకు ‘ఛ‌లో ప్రేమిద్దాం’ టీం ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular