Sunday, January 19, 2025
HomeTrending Newsధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో అమీ తుమీ

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్దమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో, ఢిల్లీలో ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది. ఏసంగి ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీకి తరలివెళ్లిన మంత్రుల బృందం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారుల ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి లతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందం ఢిల్లీ చేరుకుంది.

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదనపు ధాన్యం కొనుగోలుపై హామీ తీసుకోవటం, తెలంగాణలో యాసంగిలో పండే వడ్లు బాయిల్డ్ రైస్ కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి పియూష్ గోయల్, ప్రధానమంత్రి నరేంద్రమోడి లకు  విన్నవించనున్నారు. ఈ రోజు, రేపు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రితో భేటీకి యత్నాలు జరుగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్