Thursday, March 12, 2026
HomeTrending NewsYS Jagan: జీపీఎస్ దేశానికే రోల్ మోడల్: సిఎం జగన్

YS Jagan: జీపీఎస్ దేశానికే రోల్ మోడల్: సిఎం జగన్

ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ పథకాల డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సంక్షేమం, సంతోషం కోసం ప్రతి కార్యక్రమం మనాసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో చేస్తున్నామని స్పష్టం చేశారు. తాము అమలు చేస్తోన్న జీపీఎస్‌ దేశానికే రోల్‌ మోడల్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీపీఎస్‌ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్‌లు జీపీఎస్‌లో ఇస్తున్నామని దీని ద్వారా రిటైర్‌ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందని వెల్లడించారు.

ఉద్యోగుల కోసం గత కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ రెండ్రోజుల క్రితం కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు సిఎం ను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఏపీ రెవిన్యూ ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లుతో సహా మరికొన్ని ఉద్యోగ సంఘాలు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో నేడు  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ  రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించనక్కర్లేదని, ఉద్యోగులకు బాగుండాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రోజువారీ వేతనాలు పొందే ఉద్యోగులను కూడా ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకురావాలని సిఎం నిర్దేశించారు.

ఉద్యోగుల సమస్యలను వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని తపన పడుతున్నామని, ఓ వైపు ఉద్యోగులకు, మరోవైపు ప్రభుత్వానికి కూడా మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు.  ఉద్యోగులకు సంబంధించి కేబినెట్‌ నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా అమల్లోకి రావాలని, ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular