Friday, March 20, 2026
HomeTrending Newsబడ్జెట్ లో గల్ఫ్ కార్మికులకు కేటాయింపులపై నిరసనలు

బడ్జెట్ లో గల్ఫ్ కార్మికులకు కేటాయింపులపై నిరసనలు

ఇటీవలి బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని, దీనిపై ప్రతిపక్షాలు కూడా మాట్లాడటం లేదని గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్ని రాజకీయ పార్టీలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. బడ్జెట్ లో జీరో కేటాయింపులు చేశారని, తాము కూడా… జీరో అనే పదంపై దృష్టి పెట్టాము. జీరో పవర్ తో ఖర్చు లేని రాజకీయం, అదే… జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని అనుకుంటున్నామని ఆయన అన్నారు.

నేతల జీవితంలో ప్రతిదీ రాజకీయమే నిర్ణయిస్తున్నప్పుడు, మీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి… అనే సూక్తి ప్రకారం గల్ఫ్ కార్మికుల సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాము. ఖరీదయిన కార్పొరేట్ రాజకీయ శక్తులను అడ్డుకొని సామాన్య గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ రిటనీలు, వారి కుటుంబ సభ్యులు ఒక రాజకీయ పరిష్కారం కోసం ఆలోచిస్తున్నారు. ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ నినాదం స్పూర్తితో… క్షేత్ర స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్ గా మా కార్యకలాపాలు ప్రారంభిస్తామని రవిగౌడ్ అన్నారు.

ఉద్యమానికి, రాజకీయానికి భిన్నత్వంలో ఏకత్వం లాంటి పోలిక ఉంటుంది. నాన్ పొలిటికల్ ఉద్యమం, పొలిటికల్ ఫైట్ రెండూ ఏక కాలంలో జరుగుతాయి. ఉద్యమాన్ని చిన్న చూపు చూసిన ఫలితంగా… గల్ఫ్ కార్మికుల రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గల్ఫ్ వలసలు ఉన్న ఈ క్రింద 13 అసెంబ్లీ నియోజకవర్గాలను మొదటి బ్యాచ్ లో ఎంపిక చేయాలని సూచనలు వచ్చాయి. 1. నిర్మల్, 2. ముధోల్, 3. ఖానాపూర్ (ఎస్టీ), 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. చొప్పదండి (ఎస్సీ), 7. బాల్కొండ, 8. ఆర్మూర్, 9. కోరుట్ల, 10. జగిత్యాల, 11. ధర్మపురి (ఎస్సీ), 12. ఎల్లారెడ్డి, 13. కామారెడ్డి. ఒక మోస్తరు గల్ఫ్ వలసలు ఉన్న మరిన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను రెండవ బ్యాచ్ లో ఎంపిక చేస్తామని గల్ఫ్ వర్కర్స్ పొలిటికల్ ఫోరం నేత రవిగౌడ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular