Sunday, January 19, 2025
Homeసినిమా'హిరణ్యకశ్యప'.. వివాదస్పదం కానుందా..?

‘హిరణ్యకశ్యప’.. వివాదస్పదం కానుందా..?

దగ్గుబాటి రానా, గుణశేఖర్ కలిసి ‘హిరణ్యకశ్యప’ సినిమా చేయాలి అనుకున్నారు. ఈ చిత్రాన్ని సురేష్‌ బాబు నిర్మించాలి అనుకున్నారు. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఈ సినిమాను భారీగా నిర్మించాలి అనుకున్నారు. కరోనాకు ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే.. కరోనా రావడం.. రానాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో హిరణ్యకశ్యపకి బ్రేక్ పడింది. దీంతో గుణశేఖర్ హిరణ్యకశ్యపను పక్కనపెట్టి శాకుంతలం స్టార్ట్ చేశారు. సమంత టైటిల్ రోల్ పోషించిన శాకుంతలం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే.. యుఎస్ కామిక్ కాన్‌లో హీరో రానా హిర‌ణ్యకశ్యప పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. ఈ చిత్రంలో తాను న‌టిస్తున్నాన‌ని, దీనికి త్రివిక్ర‌మ్ క‌థ‌ని అందిస్తున్నాడ‌ని ప్ర‌క‌టించాడు. ఈ విష‌యం తెలిసి షాక్ కు గురైన గుణ‌శేఖ‌ర్ హిర‌ణ్య‌క‌శ్యప ప్రాజెక్ట్‌ పై సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంతకీ గుణశేఖర్ ఏమని ట్వీట్ చేశాడంటే.. దేవుడిని సెంట్ర‌ల్ థీమ్‌గా పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మీ ఇంటిగ్రిటీ మీద దేవుడు కూడా ఒక క‌న్నేసి ఉంచుతాడ‌ని గుర్తు పెట్టుకోండి. అధ‌ర్మంగా చేసిన ప‌నుల‌కు ధ‌ర్మంగానే స‌మాధానం దొరుకుతుంది అంటూ గుణ‌శేఖ‌ర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

దీనికి తోడు ఆయ‌న ఓ ఫొటోని కూడా షేర్ చేశారు. గుణ‌శేఖ‌ర్ ప‌క్క‌నే కూర్చుని ఉండ‌గా దేవుడి పాదం, తిరునామాలు, గంట‌లు ఉన్న ఫొటో కూడా నెట్టింట వైర‌ల్ అవుతోంది. గుణ‌శేఖ‌ర్ పెట్టిన పోస్ట్ రానా, త్రివిక్ర‌మ్‌ల‌ని ఉద్దేశించే అని స్ప‌ష్ట‌మ‌వుతోందని నెటిజ‌న్‌లు కామెంట్‌లు చేస్తున్నారు. రానా ఉత్సాహంగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తే.. గుణశేఖర్ తనదైన స్టైల్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో హిరణ్యకశ్యప వివాదస్పద మరింతగా ముదిరే అవకాశం ఉంది. మరి.. ఇది ఎటు వైపుకు వెళ్లనుందో..? ఏం జరగనుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్