Saturday, November 23, 2024
Homeసినిమాఆంధ్ర, తెలంగాణ రాజకీయాల నేపధ్యంలో 'గుంటూరు కారం'..?

ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల నేపధ్యంలో ‘గుంటూరు కారం’..?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈమధ్య మహేష్ క్లాస్ పాత్రలే చేశాడు. ఈసారి మహేష్ పాత్ర చాలా మాస్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజైన పోస్టర్ అండ్ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్టర్ బయటకు వచ్చింది. అందులో ఓ ప్లెక్సీ లో ప్రకాష్ రాజ్ రాజకీయ నాయకుడుగా కనిపిస్తున్నారు.

ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా అని అందులో రాసి ఉంది. అంటే ప్రకాష్‌ రాజ్.. శ్రీ వైర వెంకట స్వామి అనే పొలిటికల్ లీడర్ గా కనిపిస్తారని అర్థమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. గుంటూరు కారం టైటిల్ కాబట్టి ఈ సినిమా కథ గుంటూరు చుట్టూనే తిరిగే కథ అని అంతా అనుకున్నారు కానీ.. తాజా పోస్టర్ లో నిజమాబాద్ జిల్లా అని రాయడాన్ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ చిత్రానికి ముందుగా అమరావతికి అటు ఇటు అనే టైటిల్ అనుకున్నారు. అయితే.. ఏపీ రాజకీయాల్లో రాజధాని విషయమై అమరావతి పేరు ఇప్పటికీ హాట్ టాపిక్ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి అటు ఇటు అనే టైటిల్ పెడితే కాంట్రవర్శీ అవుతుందని అనుకున్నారో ఏమో కానీ.. త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని కూడా పక్కనపెట్టి ఈ టైటిల్ పెట్టారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై అందరిలో ఆసక్తి కలిగించింది. ఇప్పుడు పొలిటికల్ టచ్ ఉంటుందని తెలియడంతో మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్