Friday, March 13, 2026
Homeసినిమా#PVT04: పంజా వైష్ణవ్ తేజ్ కి సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్

#PVT04: పంజా వైష్ణవ్ తేజ్ కి సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘PVT04′(వర్కింగ్ టైటిల్) తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. చిత్ర తారాగణంలో లేటెస్ట్ సెన్సేషనల్ టాలెంట్ శ్రీలీలతో పాటు.. ప్రతిభగల నటీనటులు జోజు జార్జ్, అపర్ణా దాస్ చేరడంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్ విభిన్నమైన జోనర్‌లను ఎంచుకుంటున్నారు. అన్ని రకాల చిత్రాలలో నటిస్తూ, తనలోని నటుడిని విభిన్న కోణాలలో ప్రదర్శించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఈ సినిమా పై వైష్ణవ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ సక్సెస్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular