Sunday, January 19, 2025
Homeసినిమా'ఎస్ బాస్' అంటున్న యంగ్ హీరో హావిష్

‘ఎస్ బాస్’ అంటున్న యంగ్ హీరో హావిష్

ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ఎస్ బాస్. హావిష్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కు భాగమతి చిత్ర దర్శకుడు అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు.

దర్శకుడు అశోక్ ‘భాగమతి’ తరువాత కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుండి మొదలు కాబోతోంది. రవితేజ ఖిలాడి సినిమా తరువాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అలాగే డీజే టిల్లు కెమెరామెన్ సాయి ప్రకాష్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్