ఒకప్పుడు 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం పెద్ద హీరోలకు ఒక సవాల్ గా ఉండేది. 100 కోట్ల క్లబ్ లోకి చేరడమనేది ఒక రేర్ ఫీట్ గా ఉండేది. తమ కెరియర్లో కొన్ని 100 కోట్ల సినిమాలు ఉన్నాయని చెప్పుకోవడానికి హీరోలు .. వాళ్ల అభిమానులు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు చిన్న సినిమాలు .. చిన్న హీరోలు ఈ ఫీట్ ను చేయగలుగుతూ ఉండటం విశేషం. తెలుగు సినిమా పాన్ ఇండియా రూపాన్ని సంతరించుకోవడమే అందుకు ప్రధానమైన కారణమని చెప్పుకోవాలి .. ఒప్పుకోవాలి.
ఆ మధ్య నిఖిల్ చేసిన ‘కార్తికేయ 2’ సినిమా చాలా వేగంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. బలమైన కంటెంట్ ఉంటే .. ముఖ్యంగా నార్త్ వారికి అది కనెక్ట్ అయితే 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదనేది ఆ సినిమా నిరూపించింది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లోనే 100 కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక్కడ మూడు పెద్ద సినిమాల ధాటిని తట్టుకుని ఈ సినిమా నిలబడటం .. ఈ స్థాయి సక్సెస్ ను సాధించడం నిజంగా గొప్ప విషయమే.
ఒకప్పుడు దర్శకుడు ఇంతకుముందు ఏ హిట్ ఇచ్చాడు? హీరో ఏ హిట్ ఇచ్చాడు? అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని థియేటర్ కి వెళ్లే వారు ఎక్కువగా ఉండేవారు. ఇంతకు ముందు ఏం చేశారనేది కాదు .. ఇప్పుడు ఎలా చేశారు? అనేదే ఆడియన్స్ పరిగణనలోకి తీసుకుంటున్నారు. కంటెంట్ బాగుంటే వెంటనే కనెక్ట్ అవుతున్నారు .. హిట్ ను కట్టబెట్టేస్తున్నారు. అయితే అటు ‘కార్తికేయ 2’ .. ఇటు ‘హను మాన్’ ను తీసుకుంటే, ఈ కథల నేపథ్యంలో దైవశక్తి కనిపిస్తూ ఉండటం గమనించవలసిన విషయం.