హను రాఘవపూడి అనగానే అందరికీ ఠక్కున ‘అందాల రాక్షసి’ సినిమా గుర్తొస్తుంటుంది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా మేకింగ్ మాత్రం బాగుంటుంది. మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు. ఆతర్వాత నానితో ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఆ ఫరవాలేదు అనిపించింది.
ఆ తర్వాత శర్వానంద్ తో ‘పడి పడి లేచే మనసు’, నితిన్ తో ‘లై ‘ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో ‘సీతారామం’ అనే ఓ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ ట్రైలర్ అందరిలో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని , బ్రహ్మానందం గారికి తానంటే చాలా ఇష్టమని చెప్పాడు. హను బ్రహ్మానందం ద్వారా తన కథను ఎన్టీఆర్ దగ్గరికి పంపించారట. కథ చెప్పడానికి పావుగంట మాత్రమే ఎన్టీఆర్ టైమ్ ఇచ్చారట. ఆ తరువాత కథ చెప్పే తీరు నచ్చిందంటూ మూడు.. నాలుగు గంటల సేపు విన్నారట. అయితే అప్పటికే ఆయన స్టార్ హీరో. అందువలన కథల విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. అందువలన ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదన్నారు. మరి.. ఫ్యూచర్ లో ఎన్టీఆర్ తో హను మూవీ సెట్ అవుతుందేమో చూడాలి.
Also Read : నా మనసు కలచివేసింది: జూనియర్