Saturday, January 18, 2025
Homeసినిమాఆ అమ్మాయి గురించి సుధీర్ బాబు ఏం చెబుతాడో?

ఆ అమ్మాయి గురించి సుధీర్ బాబు ఏం చెబుతాడో?

సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. సుధీర్ బాబుకు జోడీగా కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌ పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈచిత్రం నుండి ‘మీరే హీరో లాగ’ పాటని ప్రెస్, మీడియా సమక్షంలో విడుదల చేశారు. దర్శకుడు హను రాఘపుడి ఈ ఈవెంట్ కి అతిధిగా వచ్చారు.

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ “సినిమాలని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి జర్నలిస్ట్ లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారు. ఒక మంచి సినిమా వస్తే మాకంటే మీరే ఎక్కువ ప్రమోట్ చేస్తారు. నటీనటులకు ఎంత ప్యాషన్ వుంటుందో జర్నలిస్ట్ లు కూడా అంతే ప్యాషన్ తో పని చేస్తారు. ‘మీరే హీరోలా వున్నారు’ పాట ప్రెస్ సమక్షంలో విడుదల చేయడం ఆనందంగా వుంది. ఈ పాట ప్రెస్, మీడియాకి డెడికేట్ చేస్తున్నాం. ఇంద్రగంటి గారు కథకు న్యాయం చేసే దర్శకుడు. ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. కృతి ఇందులో అద్భుతమైన పాత్ర చేసింది. ‘ఉప్పెన’ వల్ల ఆమెకు పది సినిమాలు వస్తే ఈ సినిమాతో కృతి టాలీవుడ్ లో స్థిరపడిపోతుంది. ఎలాంటి పాత్ర అయినా చేయగలననే నమ్మకం ఇస్తుందని భావిస్తున్నా”

“పీజీ విందా గారితో ఇది నా నాలుగో సినిమా. వివేక్ సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు మహేంద్ర బాబు, సుధీర్ బాబు, కిరణ్ కి ఇది పర్ఫెక్ట్ లాంచ్. సినిమా చాలా రిచ్ గా వుంటుంది. మహేష్ బాబు సినిమా ఎంత రిచ్ గా వుంటుందో ఈ సినిమాలో కూడా అంతే రిచ్ నెస్ వుంటుంది. నాకు సిరివెన్నెల గారి పాటలు అంటే ఇష్టం. ఆయన్ని మనం మిస్ కాకూడదు. అలా మిస్ కాకుండా చూసుకునే బాధ్యత రామజోగయ్యశాస్త్రి గారిపై వుంది. హను రాఘపుడి గారు నాకు ఇష్టమైన దర్శకుడు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సెప్టెంబర్ 16 న విడుదలౌతుంది. ఇంద్రగంటి గారి బెస్ట్ మూవీ ఇది. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా వుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్