Sunday, January 19, 2025
Homeసినిమా'హను మాన్' కి భలే కలిసొచ్చిందే! 

‘హను మాన్’ కి భలే కలిసొచ్చిందే! 

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హను మాన్’ తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి నిరంజన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. సంక్రాంతి సెలవు రోజుల్లో ధైర్యం చేసి ఈ సినిమా టీమ్ ముందడుగు వేయడం మంచిదైంది. కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ తీసుకున్న నిర్ణయం మేలు చేసింది.

పిల్లలు తమ పేరెంట్స్ ను ఒప్పించి థియేటర్స్ కి తీసుకుని వస్తే, లేదంటే పిల్లల సంతోషం కోసం పేరెంట్స్ వాళ్లను వెంటబెట్టుకుని వస్తే .. ఒక సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది ఈ సినిమా నిరూపించింది. మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన ఈ సినిమా, 10 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ను టచ్ అయింది. ఈ మాదిరి బడ్జెట్ లో .. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలలో ఈ స్థాయి వసూళ్లను సాధించడం నిజంగా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి.

అప్పట్లో ‘కార్తికేయ 2’ సినిమాకి కృష్ణుడి పర్వదినం కలిసొచ్చినట్టు, అయోధ్య బాలరాముడి ఉత్సవ నేపథ్యం ‘హను మాన్’కి కలిసొచ్చినట్టుగానే చెప్పుకోవాలి. వసూళ్లలో మళ్లీ పెరుగుదల కనిపించడమే అందుకు కారణంగా భావించాలి. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబడుతోంది. దైవం నేపథ్యంలో మరిన్ని సినిమాలు రావడానికి అవసరమైన ధైర్యాన్ని ఈ సినిమా ఇచ్చిందనే చెప్పాలి. కంటెంట్ ఉంటేనే కలెక్షన్స్ అనే విషయాన్ని మరోమారు నిరూపించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్