Saturday, January 18, 2025
Homeసినిమావీర‌మ‌ల్లు షూటింగ్ కి రెడీ

వీర‌మ‌ల్లు షూటింగ్ కి రెడీ

Ready for Action: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్లో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. దాదాపుగా 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డం విశేషం. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. ఇందులో ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న‌ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ న‌టిస్తోంది.

అయితే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఈ మూవీని సాధ్య‌మైనంత స్పీడుగా పూర్తి చేయాలి అనుకుంటున్నారు ప‌వ‌న్. అందుక‌నే ఈ మూవీ కోసం బల్క్ డేట్స్ కూడా ఇచ్చార‌ని తెలిసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజా షెడ్యూల్ ఈ నెల 8 నుంచి ప్రారంభించ‌నున్నారు.

ఈ సినిమాలోని యాక్ష‌న్ సీన్స్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాక్టీస్ చేస్తుండ‌డం విశేషం. దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ను మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్