Sunday, January 19, 2025
Homeసినిమాలక్ష్యం మార్చుకున్న వీర‌మ‌ల్లు

లక్ష్యం మార్చుకున్న వీర‌మ‌ల్లు

Target Changed: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్లో భారీ చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. దాదాపుగా 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పాన్ ఇండియా సినిమా కావ‌డం విశేషం. ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే.. క‌రోనా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డం వల్ల ఈ సినిమా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఈ నెల 6 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల ప‌వ‌న్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను రిలీజ్ చేయ‌డం.. ఆ వీడియో వైర‌ల్ కావ‌డం జ‌రిగింది. ఈ వీడియో రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌ర్ స్టార్ అభిమానుల్లోనే కాకుండా సామాన్య ప్రేక్ష‌కుల్లో సైతం వీర‌మ‌ల్లు పై వీర లెవ‌ల్లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాని ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. క‌రోనా కార‌ణంగా షూటింగ్ కి బ్రేక్ ప‌డ‌డంతో ద‌స‌రాకి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సిన సినిమాలు చాలా ఉండ‌డంతో ఈ చిత్రాన్ని ఎంత ఫాస్ట్ గా వీలైంత అంత ఫాస్ట్ గా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట‌. క్రిష్ ఈ మూవీని జులై లేదా ఆగ‌ష్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : నిధి అగర్వాల్  ఇంత నిదానమైతే కష్టమే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్